తెలుగులో రామ్ హీరోగా వచ్చిన 'నేను-శైలజ' చిత్రంతో ఆరంగేట్రం చేసింది.. మలయాళీ ముద్దుగుమ్మ.. కీర్తి సురేశ్. ఆ సినిమా ఘన విజయం సాధించడంతో ఈ భామకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ఈ చిత్రం తర్వాత నేచురల్ స్టార్ నాని సరసన నటించిన 'నేను లోకల్' కూడా విజయం సాధించడంతో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన నటించిన 'అజ్ఞాతవాసి'లో చోటు దక్కించుకుంది. అయితే ఈ చిత్రం నిరాశపరిచినా ఒకప్పటి అగ్రనటి సావిత్రి జీవితకథతో తెరకెక్కిన 'మహానటి' అద్భుత విజయం దక్కించుకుంది. ఈ సినిమాలో కీర్తి సురేశ్ నటనకు ఇంటాబయట ప్రశంసలు లభించాయి.
ప్రస్తుతం ఈ భామ తమిళంలో పుల్ స్వింగులో ఉంది. విక్రమ్ సరసన నటించిన 'సామి-2' ఇటీవలే విడుదలైంది. ప్రస్తుతం ఇళయదళపతి విజయ్ సరసన 'సర్కార్', ప్రముఖ నటుడు విశాల్ సరసన 'పందెంకోడి-2' తదితర చిత్రాల్లో నటిస్తోంది. ఈ రెండు సినిమాలు త్వరలోనే విడుదలకు సిద్ధమవుతున్నాయి.
కాగా, ఈ భామకు ఎప్పటి నుంచో ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తో ఒక సెల్ఫీ దిగాలనేది కోరికట. ఎప్పటి నుంచో ఈ అవకాశం కోసం ఈ భామ ఎదురుచూస్తోంది. ఎట్టకేలకు ఆ కోరిక తీర్చుకున్నానని చెప్పింది.. కీర్తి. చెన్నైలో జరిగిన సర్కార్ ఆడియో ఫంక్షన్ లో ఏఆర్ రెహమాన్ తో సెల్ఫీ దిగి తన ముచ్చట తీర్చుకుంది. ఆ పిక్ ను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్టు చేసి మురిసిసోయింది.
లేటెస్ట్ సినిమా న్యూస్, హాటెస్ట్ సెలబ్రిటీ న్యూస్, ఫోటో గ్యాలరీలు, వీడియోలు, నిష్పాక్షిక రివ్యూలు, నిరంతర టాలీవుడ్ సమాచారం కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రయిబ్ (Subscribe) చేసుకోండి.
https://www.youtube.com/channel/UCK1HnC9nfofEJzJNob4eZVw
ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయి వైరల్ న్యూస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రయిబ్ (Subscribe) చేసుకోండి.
https://www.youtube.com/channel/UCK1HnC9nfofEJzJNob4eZVw
క్రికెట్, బ్యాడ్మింటన్ తదితర క్రీడల రెగ్యులర్ అప్డేట్స్, ఎక్స్ క్లూజివ్ న్యూస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రయిబ్ (Subscribe) చేసుకోండి.
https://www.youtube.com/channel/UCK1HnC9nfofEJzJNob4eZVw
No comments:
Post a Comment