Thursday, 28 June 2018

మానసిక ఒత్తిడిని తగ్గించడానికి... యోగాసనాలు వేస్తే...

మానసిక ఒత్తిడితో రకరకాల జబ్బులు సునాయాసంగా మన శరీరంలోకి చేరుకుంటాయి. దీంతో లేనిపోని ఇబ్బందులు తలెత్తుతాయి. విపరీతమైన పని ఒత్తిడి వలన, మానసికమైన ఒత్తిడితో ఏ పని చేయడానికి మనస్సు అంగీకరించదు. మానసిక ఒత్తిడిని దూరం చేసుకోవడానికి భ్రమరి అనే వ్యాయామం చేస్తే మానసిక ఒత్తిడిని తగ్గించి, నిద్రలేమిని, గుండె, సమస్యలను, అధిక రక్తపోటును పరిష్కరిస్తుందంటున్నారు యోగా నిపుణులు. 


 


ఈ భ్రమరి వ్యాయామాన్ని క్రమం తప్పకుండా చేస్తే జ్ఞాపక శక్తికూడా పెరుగుతుందని యోగా నిపుణులు తెలియజేశారు. ఈ వ్యాయామం ఎలా చేయాలంటే ముందుగా కూర్చుని కళ్ళుమూసుకుని, చెవులను చూపుడు వేళ్ళతో మూసుకుని గాలిని గట్టిగా లోపలికి పీల్చుకోవాలి. గాలిని బయటికి వదిలేటప్పుడు మీ గొంతునుండి తుమ్మెద ఎగిరేటప్పుడు వచ్చే శబ్దాన్ని వినాలి. ఇలా రోజుకు ఐదుసార్లు చేయడం వలన ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది.